అజాద్ అనే పేరుగల మావోయిష్టుపార్టీ కేంద్రకమిటీ స్థాయి నాయకుడు తన ప్రత్యర్ధులచే చంపబడ్డాడు. ఆపార్టీ సానుభూతిపరులు ఇది బూటకపు ఎన్కౌంటరనీ, రాజ్యాంగ విరుద్ధంగా చట్టవిరుద్ధంగా ఎక్కడో వేరేచోట పట్టుకొచ్చి, చంపి అడవిలో పడవేసినారని తమ ఆక్షేపణను తెలియజేశారు. అజాద్ ను చంపిన పోలీసులపై హత్యానేరంమోపి విచారణజరిపి జైలుశిక్ష విధించాలని మీడియా ద్వారా కోరారు.
టీవీల్లో అజాద్ శవాన్ని చూడడానికి వచ్చేవాళ్ళు శవానికి శాల్యూట్ చేసారు.పూలదండలు వేశారు.పాడెపై శవాన్ని ఊరేగించారు.శవదహనవిధి నిర్వహించారు. మతపరమైన ఆచారాలు చాలావరకు పాటించలేదు. శవానికి జండాలు కప్పడం, నమస్కారం పెట్టడం, శాల్యూట్ చేయడం, పిడికిలి బిగించి లాల్ సలామ్ చెయ్యడం , పాడెపై శవాన్ని ఉంచడం, జోహార్లు చెప్పడం ఇలాంటి పనులు భావవాదులవలె చేయడం జరిగింది. పుట్టెడు దుఖంలో ఉన్నప్పుడు బహుశా చనిపోయిన వ్యక్తి గౌరవార్ధం ఇలా చేయకతప్పదేమో. కమ్యూనిష్టు పార్టీలలో ఇటువంటి మతధోరణులు బలంగా పాదుకొని ఉండడం , మతధోరణులను గుర్తించలేకపోవడం సమంజసంగాదు.
ఒక్కడు / నాయకుడు / గొప్పవాడు / ప్రత్యేకింపదగినవాడు/ అగ్రకులసంజాతుడు/ మాటకారి/ ధైర్యసాహసములు గలవాడు / సమర్ధుడు / తగిన భావజాలము గలవాడు/ అన్ని కులములకు సమ ప్రాధాన్యత / హరిజన కామ్రెడ్ / సామ్రాజ్యవాదంపై పోరాటం / కవిత్వం, కళారూపాల ద్వారా ప్రచారం ఇవన్నీ భావవాద రూపాలే. భావవాద ధోరణులనుండి కమ్యూనిష్టు పార్టీలు బయటపడేదెన్నడు ...
Home
భావవాద కమ్యూనిజం
అజాద్ అంతిమయాత్రలో భావవాద కమ్యూనిష్టుపార్టీలు
అజాద్ అంతిమయాత్రలో భావవాద కమ్యూనిష్టుపార్టీలు
Jul 25, 2010
Labels:
భావవాద కమ్యూనిజం
bouthikavaada doranulu chebite bhaguntundi.gajula
ReplyDelete