భావవాదము – విద్య
భావవాదంలో మతవిద్య బోధింపబడుతుంది. మతవిద్య వల్ల వైదిక మత పూజారులు లాభ పడతారు. కనుకనే పూర్వం నుండి మన దేశంలో మతవిద్య బోధింపబడుతుంది. బ్రిటిష్ వారిని మనదేశం నుండి పంపిన తర్వాత సోషలిష్టు భావాలు గల నెహ్రూ, ఇందిర పాలించినంతకాలం వీరి మాట సాగలేదు. ఇందిరాజీ హత్య తర్వాత వచ్చిన ఆధునిక రాజీవ్ గారికి సోషలిష్టు ఆలోచనలు లేవు. తాను వైదీకుల ఆలోచనాధోరణిలోనే ఉన్నానని నమ్మించేందుకు తాను అనేక అవకతవక పనులకు పాల్పడవలసివచ్చింది. 1986 నూతన విద్యావిధానం పేరుతో తిరిగి ఇండియాలో మతవిద్యాబోధన ప్రారంభమైంది.
మతవిద్య అంటే అన్నిరకాల అభ్యసనం మతవిషయాలద్వారా నేర్పబడుతుంది. అంటే భాష నేర్పేవంకతో మతసంబంధమైన విషయాలు పాఠ్యాంశాలుగా వస్తాయి. విజ్ఞాన శాస్త్రబోధన పేరుతో వివిధ ఆత్మ రూపాల ద్వారా బోధన ఉంటుంది. అంటే సైకిలు దాని భాగాలు అనే పాఠం బోధించడానికి సైకిలు అనే ఆత్మ విద్యార్ధి కలలో కనిపించి తనని గురించి తాను చెప్పుకున్నట్లు ఉంటుంది. అలాగే సంగీతం నేర్చుకోవడానికి “ లంబోదర లకుమికరా ” అంటూ నేర్చుకోవాలి. నాట్యం నేర్చుకోవాలన్నా ఇలాగే “ స్వామి రారా ” అంటూ... ఇలా ఏవిషయం నేర్చుకోవాలన్నా అది మతంతో కలిసి ఉంటుంది. తద్వారా ఎవరైతే ఈ రకమైన విద్వ నేర్చుకుంటారో వారు తప్పనిసరిగా గుడికి వెళ్ళి టెంకాయ కొట్టేవారుగా తయారౌతారు. ఈ విద్యా విధానం ద్వారా అన్ని మతాలకు హాజరు పెరుగుతుంది. వివిధ మతస్థలాలు భక్తులతో కిటకిటలాడుతూంటాయి. తద్వారా పూజారులకే లాభం. ఈ విద్యా విధానం ద్వారా సమాజంలో ప్రశ్నించే తత్వం ఉండదు. ఎవరు ఏమి చెప్పినా నమ్మేవిధానం అలవడుతుంది. అందుకే “ చెవిలో పువ్వు పెట్టుకునేవాడికి చెప్పు. వాడు నువ్వేది చెప్పినా నమ్ముతాడు ” అనే డైలాగ్ వచ్చింది. ఈ విద్యా విధానం వల్ల నిర్ణయాలు తీసుకునే శక్తి నశిస్తుంది.
కనుక మతవిద్య అనేది భావవాదము ను అనుసరిస్తుంది. నేట కమ్యూనిష్టులమని చెప్పుకునేవారే భావవాదరూపంలో గతితార్కిక చారిత్రిక భౌతికవాదాన్ని చదువుకున్నందువల్ల వారు సరైన రూపం చూడలేకుండా ఉన్నారు. అంటే నేడు పుస్తుకాలు చదివి హోమియో వైద్యులౌతున్నట్లుగా సిపఐ వారికి ఒకరకంగా సిపియం వారికి ఒకరకంగా ఎంయల్ గ్రూపులవారికి మరోరకంగా కనిపించడానికి భావవాద రూపంలో మార్క్సిజాన్ని చదువుకోవడమే కారణం.
0 comments:
Speak up your mind
Tell us what you're thinking... !