బ్రహ్మోత్సవం సినిమా ప్రజలలోని మత పిచ్చిని పెంచడానికి సహాయపడే ఆర్యమత
ప్రచారం. సత్యరాజు ఒక అనాధ. ఆ ఊరులోనే ఒకామె తన కూతుర్ని సత్యరాజుకు ఇచ్చి పెళ్ళి
చేసి, ఏదైనా పని చూసుకోమని
చెప్పి 400/-రూపాయలు ఇస్తుంది. ఆ డబ్బుతో రంగులు తయారు చేసి ఊరూరా తిరిగి
అమ్ముతుంటాడు.
వ్యాపారం బాగా సాగుతుండడంతో తన బావమరదులను ( రావు రమేష్, నరేష్, సయాజి షిండే, కృష్ణ భగవాన్ ) లతో కలసి తన వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తాడు. తగిన
కారణం లేకుండానే రావు రమేష్ తన బావను నిందించి అతని చావుకు కారణమవుతాడు. దానికి
తానేం బాధ పడడు. మిగిలిన బంధువులు కూడా వ్యతిరేకించరూ, బాధపడరు. తమలోతాము గొణుక్కుంటారు. ఉమ్మడి కుటుంబం వల్ల కలిగే
ఒక్క లాభం కూడా సినిమాలో లేదు. గొడవలొస్తాయనేదే చూపించారు. ఉమ్మడి కుటుంబం కావాలనే
కోరిక ప్రేక్షకునికి ఎక్కడా కలగదు. ఇది దర్శకుని లోపం.
ఇక కధానాయికలుగా కాజల్ అగర్వాల్, సమంత నటించారు. వీరిలో కాజల్ అగర్వాల్ అందంగా కనిపించింది. తన
నటన బాగుంది. తాను మహేష్ బాబును ప్రేమించింది. మహేష్ కూడా కాశీని ప్రేమించాడు.
హీరోయిన్ హీరో ప్రేమను నిరాకరించింది. కొన్నాళ్ళు ప్రేమించుకున్నాక
కాదనుకోవడానికి సరైన కారణం లేదు. ఉమ్మడి కుటుంబంలో బాగా కలిసిపోయి ఎంతో ఆనందంగా ఉంటూనే హఠాత్తుగా నేను
ఈ ఉమ్మడి కుటుంబంలో ఇమడలేనని చెప్పి వెళ్ళి పోవడం విచిత్రమైన లోపం.
సమంత రూత్ ప్రభు గారిది విచిత్రమైన పాత్ర. ఒక మానసిక వికలాంగురాలివలే
ప్రవర్తించడం, ఎవరో
తెలియని వాళ్ళు తింటున్నదానిని తీసికొని ఎలాంటి స్పృహ లేకుండా తినడం , ఎవరో త్రాగబోతున్న
దానిని తీసికొని అందులో ఏముందో కూడా తెలీకుండా త్రాగడం. పబ్బులో త్రాగడం వంటి వింత
చేస్టలు చేసే వింత పాత్ర. నిజ జీవితంలో ఇలాంటి విచిత్ర పాత్ర ఎక్కడా కనిపించదు. ఈ పాత్ర
కధకు నిరుపయోగం.
హీరో పెద్ద మేనమామ కు ప్రణీత సుభాష్ అనే కూతురు ఉంటుంది. కానీ ఈ
అమ్మాయిని హీరో పెళ్ళాడాలని ఉమ్మడి కుటుంబంలో ఎవరూ అనుకోరు. అసలావిషయమే ఎక్కడా
ప్రస్తావనకు రాదు. కాని హీరో మరో అమ్మాయిని ప్రేమించడం వల్ల హీరో తండ్రిపై విలన్
తగాదా పడడం, దానిని
ఉమ్మడి కుటుంబంలోని సభ్యులెవరూ విమర్శించకపోవడం తద్వారా హీరో తండ్రి చనిపోవడం
జరుగుతుంది. ఆ చావుకు కాజల్ కారణమని ఎవరైనా నిందించితే తద్వారా తన ప్రేమను త్యాగం
చేసుకొని వెళ్ళిపోయినట్లు ఉంటే బాగుండేది. కానీ అలాలేదు.
మహేష్ బాబు గారి పాత్ర మరీ దయనీయం. ఉమ్మడి కుటుంబంలో అందరి
ప్రేమాభిమానాలు పొందుతూ పెరిగాడు. ఉమ్మడికుటుంబ సభ్యులతోపాటు రంగుల కంపెనీలో
పనిచేసాడు. ఉమ్మడి కుటుంబం అంటూనే అప్పుడప్పుడూ బంధువుల ఇళ్ళలో భోజనం చేస్తుంటాడు.
( ఉమ్మడి కుటుంబమంటే అనేక కుటుంబాలు ఎవరికి వారు వండుకొని తినడంకాదని దర్శకునికి
తెలిసినట్లులేదు. సినిమా ఫెయిల్ అవడానికి దర్శకునికి ఉమ్మడి కుటుంబం గురించి సరైన
అవగాహన లేకపోవడం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ) మొదట హీరో కాశీ అనే
అమ్మాయిని ప్రేమించి, తాను కాదంటే మరో అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆకారణంగా తన తండ్రి
సంబంధించిన బంధువుల గురించి తెలుసుకోవాలనుకోవడం, అన్నిరకాల వివరాలు మతసంస్థల్లో దొరుకుతాయి దర్శకుడు చెప్పడంలో మత
నమ్మకాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లుంది. ఉమ్మడి కుటుంబం అంటూనే ప్రణీత
పెండ్లికి హీరోనూ, అతని తల్లిని పిలవకపోవడం, వాళ్ళు తమను పెళ్ళికి పిలవకపోయినాగానీ హీరోగారు తన క్రొత్త
బంధువులందరనీ పెళ్ళికి రమ్మని పిలవడం, మిగిలిన బంధువులంతా ఏమీ జరుగనట్లు పెళ్ళి పనులలో పాలు పంచుకోవడం, తమను పెళ్ళికి
పిలువకపోయినా హీరో, హీరోతల్లి పెళ్ళికి వచ్చి, మీతోపాటు మమ్మల్ని కూడా కలుపుకోండని విలన్ ను ప్రాధేయపడడం, ఆస్తి అంతా విలన్ గారి
పేరుతో వ్రాస్తున్నారని తెలుసుకొని విలన్ పశ్ఛాత్తాపపడడం వంటి వింత సన్నివేశాలతో
మెదడును మిక్సీలో వేసి తిప్పినట్లు గొప్పగా ఉంది సినిమా.
పాటలు, సంగీతం, కెమేరా పనితనం బాగుంది.
నాజర్, శుభలేఖ సుధాకర్, జయసుధ, రేవతి, ఈశ్వరిరావు, తనికెళ్ళ భరణి, సయాజి షిండే, తులసి, బ్రహ్మాజీ, కృష్ణభగవాన్, పావని గంగిరెడ్డి, గొల్లపూడి మారుతీరావు, మెంటల్ కృష్ణ, వెన్నెల కిషోర్, జయప్రకాష్ రెడ్డి, ముఖేష్ రుషి మొదలైనవారు అప్రధాన పాత్రల్లో నటించారు. మొత్తం మీద SVBC ఛానల్ లో ప్రసారం కోసం తీసిన డాక్యుమెంటరీ లాగా ఉంది.
0 comments:
Speak up your mind
Tell us what you're thinking... !