Survey on Rs.500 and Rs.1000 notes banning

Nov 22, 2016


14 Days After Banning Old Notes, PM Modi Seeks Public Opinion on His App


PM invites views from the people, on decision taken regarding currency notes of Rs. 500 and Rs. 1000



రు.500, 1000 కరెన్సీ నోట్లపై తాను తీసుకున్న నిర్ణయాన్ని గురించి తమ  ఆలోచన ఏమిటో చెప్పాలని ప్రజలను ప్రధాని అడుగుతున్నారు


నరేంద్రమోడి యాప్ ద్వారా 10 ప్రశ్నలకు ప్రజలు తమ అభిప్రాయాలు తెలుపవచ్చునని ప్రధాని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

ఆ పది ప్రశ్నలు ఇవి...

1. భారత దేశంలో నల్లధనం ఉందని మీరు అనుకుంటున్నారా ?
 a. అవును
 b. లేదు.

2. అవినీతి వలన కలిగే దుష్టత్వంపై  మరియు నల్ల ధనంపై పోరాటం చేసి దాన్ని తొలగించాలని మీరు అనుకుంటున్నారా ?
a. అవును
b. లేదు

3. మొత్తంమీద నల్ల ధనాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం గురించి మీరు ఏమని అనుకుంటున్నారు ?



4. అన్యాయానికి వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం చేస్తున్న కఠనమైన అణచివేత గురించి మీరేమని అనుకుంటున్నారు ?
జవాబు 1 నుండి 5 వరకు గల స్ధాయిలలో  -
అద్భుతం ,
చాలా బాగుంది ,
బాగుంది ,
ఫరవాలేదు ,
పనికిమాలినది

5. మోడి ప్రభుత్వం రు.500/-, రు.1000/-ల నోటులను రద్దు చేసిన దానిపై మీరు ఏమని అనుకుంటున్నారు ?
a. సరైన విధంగా చేసిన గొప్ప పని
b. మంచి పని  
c. అనుకున్నంత మార్పేమీ జరగలేదు

6. నోట్ల రద్దు నల్ల డబ్బును, అవినీతిని , తీవ్రవాదాన్ని అణచివేసిందని మీరు భావిస్తున్నారా ?
a. అవి తీవ్రముగా దెబ్బతింటాయి.
b.  ప్రస్తుతం మధ్యస్థంగానూ భవిష్యత్తులో ఎక్కువగానూ దెబ్బతినవచ్చు
c. కొంచం దెబ్బతింటాయి
d. నాకు అంతగా తెలియడం లేదు

7. నోట్ల రద్దు సామాన్య ప్రజలకు  భూములు,ఇళ్ళు , ఉన్నత విద్య, ఆరోగ్యరక్షణను  అదుబాటులోకి  తెస్తుంది.
a. పూర్తిగా ఒప్పుకుంటున్నాను
b. కొంత వరకు అంగీకరిస్తున్నాను
c. నేనేమీ చెప్పలేను

8. అవినీతిని అరికట్టేందుకు, నల్ల డబ్బును , తీవ్రవాదాన్ని, దొంగ నోట్లను నిర్మూలించేందుకై  మనం చేస్తున్న  పోరాటంలో మీకు కలిగిన అసౌకర్యానికి బాధ పడుతున్నారా ?
a. అస్సలు లేదు
b. కొంతవరకూ ఉంది కానీ ఫరవాలేదు
c. అవును

9. కొందరు  అవినీతి వ్యతిరేక కార్యకర్తలు ప్రస్తుతము నల్ల ధనానికి, అవినీతికి, తీవ్రవాదానికి అనుకూలంగా పోరాడుతున్నారని మీరు నమ్మగలరా ?
a. అవును
 b. కాదు

10. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో మీరేమైనా సూచనలు, ఉపాయాలు లేక మెళుకువలు పంచుకోవాలనుకుంటున్నారా ?



సమకాలీన విషయాలపై జరుగుతున్న ఈ సర్వేలో    కీలకమైన పాలసీ మరియు అమలు విషయాలపై భారతదేశ ప్రజల యొక్క భాగస్వామ్య పాలన అభిప్రాయాలు నేరుగా ప్రధానమంత్రి దృష్టికి తేవాలని కోరుచున్నారు.

 500/-1000/- నోట్లను చట్టబద్దంగా నిరోధించే నిర్ణయం వల్ల కలిగే ప్రత్యక్ష మార్పుల గురించి ప్రధాని ప్రజల నుండి ఖచ్చితమైన  జవాబులు కోరుతున్నారు.  ప్రధాని ప్రజలనుండి అభిప్రాయలను కోరిందికూడా  ఆ నిర్ణయాలు బలంగా ఎలా అమలు చెయ్యాలా అని.

ప్రజలతో ప్రత్యక్షంగా మమేకం కావడంలో ప్రధానమంత్రి యొక్క స్థిరమైన నమ్మకాలు ఈ సర్వే ద్వారా మరింత బలపడాలని కోరుచున్నారు.

Share this article :

0 comments:

Speak up your mind

Tell us what you're thinking... !

 
Support us : APTF257 || మాష్టారు || Ajit Kumar ||
Copyright © 2013. మాష్టారు - All Rights Reserved
Designed by The Masters Mind || Published by Divine Spirit || Tech Gnan ||
Proudly powered by Ajit Kumar || On Facebook || On Twitter ||