2018 యన్నికలలో జింబాబ్వే అధ్యక్షునిగా పోటీచేయబోతున్న శ్రీ రాబర్టు ముగాబే
Dec 18, 2016
జింబాబ్వే లో అధికారంలో ఉన్న జాను-పియఫ్ పార్టీ తాను 2018 ఎన్నికలలో ప్రస్తుత దేశాధ్యక్షుడు శ్రీ రాబర్టు ముగాబే తిరిగి పోటీ చేస్తాడని ప్రకటించింది.
జింబాబ్వే దేశం 1980లో బ్రిటన్ నుండి స్వాతంత్ర్యం పొందినప్పటినుండి శ్రీ రాబర్టు ముగాబే గారి పాలనలోనే ఉంది. ప్రస్తుతం రాబర్టు ముగాబే వయసు 92 సంవత్సరాలు. జానూ పియఫ్ యువజన విభాగంతోసహా అన్ని పార్టీలూ శ్రీ రాబర్టు ముగాబేను జీవితకాల అధ్యక్షునిగా ప్రకటించాయి. కానీ ఆర్ధిక పరమైన కల్లోలం దేశంలో ఇటీవల చోటుచేసుకుంది. జాను పియఫ్ పార్టీలో కూడా శ్రీ రాబర్టు ముగాబే తరువత కాబోయే నాయకుడు యవరూ అనే విషయంలో గొడవలు పడుతున్నారు. దేశంలోని ఆర్ధిక సమస్యలకు విదేశాలలోని సంక్షోభాలే కారణమని శ్రీ రాబర్టు ముగాబే గారు అన్నారు.
Labels:
News
0 comments:
Speak up your mind
Tell us what you're thinking... !