చైనా దక్షిణ సముద్రంలో పట్టుబడ్డ అమెరిగా నీటిడ్రోను
Dec 18, 2016
నీటిలో ఈదే అమెరికా వారి డ్రోనును చైనా వారు చైనా దక్షిణ సముద్ర తీరంలో స్వాధీనం చేసుకున్నారు. దానిని తిరిగి అమెరికాకు ఇవ్వడానికి అంగీకరించారు. అది నీటి ఉష్ణోగ్రతనూ నీటి స్వచ్ఛతనూ కొలవడానికి ఉపయోగింపబడుతుందని అమెరికా తెలిపింది. అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన డోనాల్డు ట్రంపు గారు దానిని చైనా వాళ్ళు దొంగిలించారని ఆరోపించారు. దానిని వాళ్ళనే ఉంచుకొమ్మని దానిని తిరిగి తీసుకోవాలని తాము అనుకోవడంలోదని ట్వీటారు.
ఈ సంఘటన వల్ల ఇరుదేశాల సైనికుల మధ్య తీవ్రమైన గొడవలు వచ్చే అవకాశం ఉంది. ఆ డ్రోను ఒక మనిషిలేకుండా నీటిలో తిరిగే వాహనమనీ దానిని శాస్త్రీయ పరిశోధనలకోసమే ఉపయోగించబడుతుందని కనుక భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు మరోసారి చేయరాదని చైనాను పెంటగాను హెచ్చరించింది. నేరుగా చైనా అధికారులతో మాట్లాడి ఒక అవగాహనకు వచ్చామని దానితో చైనావారు తమ డ్రోనును తిరిగి తమకు అప్పగించడానికి అంగీకరించారని పెంటగాను అధికార ప్రతినిధి పీటరు కుక్కు గారు చెప్పారు.
Labels:
News
0 comments:
Speak up your mind
Tell us what you're thinking... !