జాతీయ అంతర్జాతీయ వైద్యులు చేసిన 60 ఆపరేషన్ల ప్రత్యక్ష ప్రసారం
Dec 15, 2016
రోబోట్లు చేసిన రెండు సర్జరీలతోసహా దేశమంతటా జరిగిన దాదాపు 60 ఆపరేషనులు శిక్షణలో భాగంగా మైసూరు నుండి ప్రత్యక్ష ప్రసారం చేయబడ్డాయి.
జాతీయ అసికోన్-2016 ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో జాతీయ అంతర్జాతీయ వైద్యులచే కోయంబత్తూరు లోని జెయియం ఆసుపత్రి, బెంగుళూరు లోని తులిప్పు ఆసుపత్రి, ముంబాయి లోని కొలియాబెన్ ధీరూబాయి అంబానీ ఆసుపత్రి, మైసూరు లోని జెయస్సెస్ ఆసుపత్రి మొదలైన ఆరు ఆసుపత్రులలో చేయబడిన కత్తికోతలను ఈ సందర్భంగా ప్రత్యక్ష ప్రసారం చేశారు. వీటిలో ముంబాయికి చెందిన డాక్టర్ యువరాజు గారు రోబోటు సహాయంతో చేసిన కిడ్నీ ఆపరేషనూ, డాక్టర్ అరుణ్ ప్రాస్ గారు ఢిల్లీ నుండి రోబోట్ సహాయంతో చేసిన బారియాట్రిక్ ఆపరేషనూ కూడా ప్రత్యక్ష ప్రసారం చేయబడినవి.
ఐదు రోజులపాటు జరుగుతున్న ఈ సమావేశాలు ఆపరేషనులు చేయడములో వస్తున్న కొత్త పద్ధతులను తోటి వైద్యులకు తెలియజేసే ఉద్దేశ్యంతో జరుగుతున్నాయి. దాదాపు ఐదు వేలమంది నిపుణులైన వైద్యులు మరియు పోష్టు గ్రాడ్యుయేటు వైద్య విద్యార్ధులూ ఈ సమావేశంలో పాల్గొన్నారు. 1100 శాస్త్ర పరిశోధనా పత్రాలు అందించబడ్డాయి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ సిద్ధరామయ్య గారు అధికారపూర్వకంగా అశ్సియోన్-2016ను ప్రారంభించాల్సియుండినప్పటికీ అనివార్య కారణాలవల్ల అది రద్దయింది.
Labels:
News
0 comments:
Speak up your mind
Tell us what you're thinking... !