వేస్టు

Jul 12, 2008

విమల : ఏమే కమలా ! ఉద్యోగం రాకముందు అసలు పెండ్లే చేసుకోనన్నావ్ ? మరి టీచర్ ఉద్యోగం రాంగానే పెండ్లి చేసుకొని ఇద్దరు పిల్లల్ని కన్నావేం?
కమల : ఆ ... మరీ ... మెటర్నటీ లీవులు వేస్టవుతాయనీ...
విమల : ఆఁ !!!

మెగాస్టార్ చిరంజీవి గారు సిఎం అయితే అవినీతిని అరికట్టగలడా?

Jul 4, 2008

మెగాస్టార్ చిరంజీవి గారు రాజకీయపార్టీ నిర్మిస్తున్న క్రమం వ్యూహాత్మకంగా, ముచ్చటగా ఉంది. ఠాగూర్ సినిమాలోలాగా అవినీతిని అంతంచేయగల ఏకైక నాయకుడుగా చాలామంది ప్రజలు నమ్ముతున్నట్లుగా కనిపిస్తుంది. చిరంజీవి గారు ఒక రాజకీయ పార్టీకి కావలసిన అన్ని హంగులూ ఏర్పరచుకుంటున్నట్లుగావుంది. నా అంచనా ప్రకారం వైయ్యస్సార్ గారు నేటి నుండి అవినీతిపై అవిశ్రాంత పోరు చేస్తానికి సిద్ధమౌతున్నట్లుగావుంది.కానీ కాంగ్రెస్ పార్టీలో అది సాధ్యంకాకపోవచ్చు. చిరంజీవిగారి ఎత్తుగడ కూడా అవినీతిలేని పాలన హామీగా ఎన్నికలబరిలోకి దూకి, ఆన్ని ప్రతిపక్షాల సహకారంతో రాజ్యాధికారం చేపట్టాలని కొండంత ఆశతో ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ అది అడియాసే కావచ్చు. ఎందుకంటే...
మనదేశ చట్టాలను గమనించండి. బ్రిటీష్ వారు మన దేశాన్ని పాలించడానికి కొన్ని చట్టాలను చేశాడు.అవే బానిస చట్టాలు. చట్ట ప్రకారం ప్రభుత్వరహస్యాలు వెల్లడించరాదు. ప్రభుత్వం నుండి ప్రజలెవరైనా సహాయం పొందాలంటే కొంత లంచంగా సమర్పించుకోవాల్సివచ్చేది. పోలీస్ సహాయం కోరితే పోలీసువారికీ, న్యాయ సహాయం కోరితే పీ.పీ గారికీ, ఆస్తి కొన్నా,అమ్మినా రిజిష్టారువారికీ..... ఇలా అన్నిరకాల ప్రభుత్వాధికారులకు కొంత మొత్తం లంచంగా చెల్లించితేనే అధికారులు పనిచేసేవారు. అలా ఆయాశాఖలవారు తాము వసూలు చేసిన మొత్తాలను( 90శాతం ) తమ పై అధికారులకు అందిస్తారు. అలా అధికారులందరివద్దనుండి డబ్బు వసూలు చేసే అధికారినే కలెక్టర్ అంటారు.ఆ విధంగా బ్రిటీష్ వారికి డబ్బు ముట్టేది. మనకి స్వాతంత్ర్యం వచ్చినా చట్టాలు మారనందున తమ పాత అలవాట్ల ప్రకారం నేటికీ లంచం అడగబడుతూంది.
ఇక మెగాస్టార్ సియ్యం అయ్యాడనే అనుకుందాం. తాను చట్టాలు మార్చగలడా? రాష్ట్రాలను పాలించడానికి రాజప్రతినిధులుగా కేంద్ర ప్రభుత్వం నుండి సుమారు వందమందికి పైగా ఐఏయస్సులూ, ఐపీయస్సులూ, ఐయ్యస్సెఫ్ లూ వస్తారు.ఆ వచ్చిన వారిలోనుండే మనం పరిపాలింపబడాలి. వారికి కొద్దిమందికైనా ఎంతో కొంత లంచంగా యివ్వందే మనం చెప్పినట్లు పనిచేస్తారా? .....ఏమో..... చెయ్యకపోవచ్చనుకుంటున్నాను. మీరేమంటారు?

సలహా

Jul 2, 2008

రాము : మాష్టారూ! తీవ్రమైన తల నొప్పి కోసం ఏదైనా సలహా ఇవ్వండి.
మాష్టారు : ఏముందిరా! సింపుల్. ఓ సుత్తి తీసుకుని తలకేసి కొట్టుకో. తీవ్రమైన తలనొప్పి వెంటనే వస్తుంది.
రాము : ???
----------
మాష్టారు : ఏమిట్రా రామూ! చేతికా కట్లేంటి?
రాము : చయ్యి రెండు చోట్ల విరిగింది మాష్టారూ!
మాష్టారు : ఆ రెండు చోట్లకు మళ్ళీ వెళ్ళకురో! వెధవది మళ్ళీ విరుగుతుందేమో..
రాము : ???

కుదరదు

Jul 1, 2008

మాష్టారు: రామూ! నువ్వు నిన్న స్కూలుకు రాలేదేం?
రాము : మరే... నిన్న మా గేదె ఎదైతే మానాన్న దాన్ని దున్నదగ్గరికి తోలుకు పొమ్మని నన్ను పంపాడండీ.
మాస్టారు : నిన్నెందుకురా పంపడం. ఆపనేదో ఆయనే చెయ్యొచ్చుగా?
రాము : ఆపని మానాన్న చేయగూడదంటండీ..
మాష్టారు: ఏం ?
రాము : దున్నేచెయ్యాలంట.
మాస్టారు : ???
 
Support us : APTF257 || మాష్టారు || Ajit Kumar ||
Copyright © 2013. మాష్టారు - All Rights Reserved
Designed by The Masters Mind || Published by Divine Spirit || Tech Gnan ||
Proudly powered by Ajit Kumar || On Facebook || On Twitter ||