పిల్లల
పెంపకం
పిల్లల
పెంపకం అన్నది ఒక కళ, తల్లి దండ్రుల పెంపక విధానాలను బట్టి పిల్లల ప్రవర్తన ఆధారపడి ఉంటుంది.
మొక్కై వంగనిది మానై వంగునా అన్న సామెత ఆధారంగా పిల్లలను చిన్న వయస్సు నుంచే
సక్రమంగా తీర్చిదిద్దవలసిన బాధ్యత తల్లిదండ్రులది. అలా అని పిల్లలను ప్రతీ చిన్న
విషయానికి కఠినంగా శిక్షించకూడదు. ప్రేమ ఆప్యాయతతో వారి మనస్సులలో
మార్పుతీసుకురావాలి. చిన్నప్పటి తల్లిదండ్రుల పెంపక విధానాలపైనే పిల్లల భావి జీవిత
పునాది ఏర్పడుతుంది.