అణు ఒప్పందం మీకు అంగీకారమేనా ?

Jun 30, 2008

అమెరికా ఇండియా దేశాల మధ్య అణు ఒప్పందం జరగాలని, వద్దని రెండు విధాలుగా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈ విషయం గురించి మీరు ఏమనుకుంటున్నారు?
నాకు తెలిసినంతవరకూ అమెరికా పాకీస్థాన్ వైపూ, రష్యా ఇండియా వైపూ ఉండేవి. ఇండియా అలీనదేశాలకు నాయకత్వం వహిస్తుంది.ఇప్పుడు అమెరికా మన విద్యుత్ అవసరాలను కోసం అణువిద్యుత్తు తయారుచేసుకునే పరిజ్ఞానాన్ని మనకు ఇవ్వడానికి తహతహ లాడుతుంది. ఎందుకు?
ఈ అణు ఒప్పందం అమలు 4 దశలుగా జరగాలి. 1.అణుఇంధనాన్ని సప్లై చేసే గ్రూపు ( NSG ) మన దేశంతో చర్చించి అంగీకారం తెల్పాలి. 2.అంతర్జాతీయ అణు సంస్ధ ( IAEA ) ) మన దేశంతో చర్చించి అంగీకారం తెల్పాలి. ( ఇప్పుడు జరగబోయే సీను ఇదే.)3. భారతదేశ కేంద్ర ప్రభుత్వం అమెరికా షరతులకు అంగీకరించాలి. 4. పై మూడు ఒప్పందాలను పరిశీలించాక అమెరికా పార్లమెంటు అంగీకరించి చట్టం చెయ్యాలి.
ఇప్పటివరకూ 25 దేశాలతో అమెరికాకు అణు ఒప్పందం కుదిరింది. వాటిల్లో కమ్యూనిష్టులు అభిమానించే చైనా దేశం కూడా ఉంది. మరి కమ్యూనిష్టులు ఈ అణు ఒప్పందాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఎందుకంటే ఆ 25 పెద్దదేశాలు సంతకాలు చేసి అంగీకారం తెల్పిన తర్వాత 2007లో Hyde చట్టాన్ని అమెరికా తయారుచేసి అమెరికా కాంగ్రెస్ లోని రెండు సభలూ ఆమోదించింనాయి, అమెరికా ప్రసిడెంటు జార్జి బుష్, కూడా సంతకం చేసాడు. దానికంటే ముందు 2005 జూలై నెలలో మన ప్రధాని అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు ఈ అణు ఒప్పందం విషయం బుష్ ప్రతిపాదించాడు. 2006 మార్చి లో ఢిల్లీలో భారత ప్రధాని మనమోహన్ సింగ్, అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ పౌర అణు సహకార ఒప్పందంపై సంతకాలు చేశారు. మనం చాలా ఆనందించాం, ఆశ్చర్యపోయాం ఎందుకు ఆయాచితంగా ఈ వరాన్ని ప్రసాదిస్తున్నారా అని. తర్వాత తెల్సిందేమిటంటే ఇరాన్ దేశం నుండి పాకీస్థాన్ , ఇండియా మీదుగా చైనా దేశానికి గ్యాసు పైపు లైను నిర్మించి , తక్కువ ధరకు గ్యాసు మనకు లభించేలాగా, తక్కువ ఖర్చుతో మనం విద్యుత్తు ఉత్పత్తి చేసుకోగలిగేలాగా చైనా, పాకీస్థాన్ , ఇరాన్ లతో మనం ఒక ఒప్పందం చేసుకొని ఉన్నాం. ఈ ఒప్పందాన్ని చెడగొట్టాలని అమెరికా ఎత్తుగడ పన్నింది. పాకీస్థాన్ ఎటూ అమెరికా మాట కాదనదు, మరి మనల్ని ఒప్పించాలంటే ఈ ఉచిత అణువిజ్ఞానబదలాయింపు అనే అస్త్రం ద్వారా మనల్ని పడగొట్టింది. ఇరాన్ దేశానికి వ్యతిరేకంగా మనచేత ఐక్యరాజ్యసమితిలో ఓటు వేయించింది. వెనుకబడిన దేశాలతోఒప్పందంగా భావించి, Hyde చట్టాన్ని దీనితో జతచేశారు.Hyde చట్టం ప్రకారం మనం ఇతర దేశాలతో చర్చలు జరపాలంటే అమెరికా అధ్యక్షుని అనుమతి తీసుకోవాలి. అమెరికా అధ్యక్షుడు ఏసమయంలో అయినా తన ఒప్పందాన్ని రద్దు చేసుకోవచ్చు. ఇలా ఈ Hyde చట్టం లోని సెక్షన్ 103, 104, D2 మొదలైనవి భారతదేశానికి ఇబ్బంది కలిగించే అంశాలు. “ చట్టంలో అలా వుంది గానీ నేను ఆ అధికారాన్ని వినియోగించను ” అని జార్జి బుష్ గారు అంటున్నారు.
మన దేశ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కూడా ఈ అణు ఒప్పందం బాగానేవుంది అన్నారు. కానీ మనదేశ అణుశాస్త్రవేత్తలు ఈ ఒప్పందాన్ని తిరస్కరించారు. ప్రస్తుతం మైనారిటీగావున్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఆమోదం పొందకుండా భారతదేశ సార్వభౌమాధికారాన్ని మరోసారి తెల్లవానికి తాకట్టుపెట్టడం మంచిదంటారా?
Share this article :

7 comments:

  1. "Iran కు వ్యతిరేకంగా మనచేత ఓటు వేయించింది" ఇది తప్పేమో నని నా అభిప్రాయం. ఈ విషయంలో మనమే విలువలకు తిలోదకలిచ్చేశాం. అమెరికా ఏంచెబితే దాన్ని గుడ్డిగా follow అవడమేకానీ మనకొంటూ సొంత గొంతు లేకుండాచేసేసుకున్నాం. ఇది చాలక మళ్ళీ ఐ.రా.స. లో శాశ్వత సభ్యత్వం కోసం పాకులాట ఒకటి. తీరా అది వచ్చాక కూడా మనవిధానంలో మార్పు అసలు రాదని బల్ల గుద్దిచెప్పగలను సరే అది వేరే విషయం.
    ఈ ఆణుబంధాన్ని గురించి మరింత సమాచారాన్ని ఇవ్వగలరు. దీన్ని మేధావులందరితోనూ చర్చించి నిర్ణయంతీసుకోవాల్సి వుండగా గౌరవ ప్రధాని గారు మరీ మొండిగా వ్యవహరిస్తున్నారని నాఅభిప్రాయం. నిబంధనలు పేరుకు మాత్రమేనన్న సన్నాయినొక్కులు అమెరికా విధానాలను గమనించిన వారెవరికైనా నమ్మబుధ్ధికాదు. నాకైతే Merchant Of Venice లో Shylock dialogues గుర్తుకు వస్తున్నాయి.

    ReplyDelete
  2. స్వాతంత్ర్యం కాంగ్రెస్సు సొత్తు కదా! తాకట్టు పెట్టడం వారి హక్కని భావిస్తుండవచ్చు :) ఇటువంటి సందర్భాలలోనే మన్మోహన్, కలాం లాంటి మేధావులకు, పి.వి, వాజపేయి, నెహౄ లాంటి రాజనీతిఙులకు మధ్యనున్న అగాథం ప్రస్పుటమవుతుంది. నేతలకున్న బుద్దికుశలత, దూరదృష్టి విఙ్ఞానవంతులకు వుండవు. అమెరికా లాంటి విష నాగులను, జిత్తులమారి నక్కలను చేరదీస్తే కలిగే దుష్ప్రభవాలను ఎంతో మంది నీతికోవిదులు ఎన్ని సందర్భాలలో నిరుపించినా, మూర్ఖ మేధావులకు పట్టనేల?

    ఒప్పందం మీద సంతకం పెట్టిన తరువాత పార్లమెంటులో తేల్చుకుంటారట మన గౌరవనీయులైన ప్రధాన మంత్రి గారు.

    ReplyDelete
  3. నేను ఇప్పటి దాకా అణు ఒప్పందం చేసుకోక పోవటం వల్ల భారత దేశం, భవిషత్తులో ఇంధన క్రంచ్ ను ఎదుర్కోబోతున్నదని నమ్ముతూ వస్తున్నాను. నా అభిప్రాయాలను మార్చుకొనే విధంగా, సరిపడినన్ని కారణాలు నాకు ఇంకా ఇక్కడ కనిపించటం లేదు.
    ఇంకా మిత్రులెవరైనా తమ కామెంట్ల ద్వారా తెలియచేస్తారని భావిస్తున్నాను.

    సాహితీ యానం

    ReplyDelete
  4. @బాబా గారూ, ఐక్యరాజ్యసమితి, నాటో, ఘ్8, ఓఫేఛ్ కోవలొకే ణ్శ్ఘ్, ఈఆఏఆ వస్తాయి. ప్రస్తుతం ఇండియాను మచ్చిక చేసుకుని ఒప్పందం మీద దస్తఖతు వేయించి, కొంతకాలం వనరులను అందిస్తారు. భవిష్యత్తులో హనీమూన్ ముగిసాక(ఇది కొన్ని సంవత్సరాలు లేక దశాబ్దాలు కావచ్చు, అమెరికా దూరదృష్టికి తార్కాణాలకోసం చరిత్రను పరిశీలించండి), భారత అభివృద్ది కంటకింపుగా లేక తనకు ప్రమాదకరంగా అనిపించినా లేక అమెరికా యొక్క ఒకానొక దురాక్రమణను సమర్థించక పొయినా, పై పావులను (సంస్థలను) కదిపి కట్టడి చెస్తారు. అప్పటికే అమెరికా సహకారంతో స్వావలంబనను మరచి మన పరిశోధనలు మూలన పడో, భ్రష్టు పట్టో వుంటాయి. మింగలేక కక్కలేక జపాన్ లానో, ఎదురు తిరిగి ఇరాక్ లానో బలికావలసి వస్తుంది.

    మన శాస్త్రఙ్ఞులు అనేక విజయాలు సాధించి కొన్ని మెట్లు ఎక్కిన పరిణామక్రమంలో అమెరికా నుంచి అమెరికా పెత్తనం లోని సంస్థల నుంచి ఎదురైన ప్రతిభంధకాలను, శాశనాలను ఎలా మర్చి పోగలం? మన వారు, ప్రతిభకు సంపుర్ణ సహకరం అందించగలిగితే స్వావలంబనను సాధించగలరని ఎన్నో సందర్భాలలో నిరూపించారు. కొంత సమయం తీసుకున్నా అదే ఉత్తమ ప్రయత్నం. ఆవసరార్థం మనం మిత్రులుగా మనవలసి వచ్చినా, కుటిల మితృని స్వభావమెరిగి జగరూకతతో, హద్దులు మీరని స్నేహంతో సరిపెట్టుకోవడం ఎంతైనా మంచిది.

    ఇంతకీ అమెరికాకి ఉన్నట్టుండి భారత్ పై ఇంత ప్రేమ ఎందుకో, బుష్ గారి సన్మోహనానికి పరవశులై ప్రేమ గీతికలు ఆలపించిన ఆ మన్మొహనులవారికీ తెలియకపోవచ్చు. తెలిసీ రొకటి పొటుకు వెరవక పోతే, కొంతకాలానికి మరో గాంధి గారి కోసం మనం ఎదురుచుడవలసి వస్తుంది.

    ReplyDelete
  5. Thank God, left parties are a part of the govt. otherwise we'd have become the american satellite with remote sitting in Washington DC.
    This is the only 'noteworthy' thing that communists did since independence and they cn qoute it for the next 100 years.
    There is no free lunch offered by USA. Once you commit to USA you have committed forever, there is no going back and you are a slave forever.
    God save india
    hail communist parties of India
    Congress party, Soni Manmohan...you suck

    ReplyDelete
  6. On any given day Iran is a better friend than USA.
    Remember who came to our rescue when we were fighting Pakisthan and USA sent 'Seventh fleet' to Indian ocean in support of Pak...it was Iraq and Saddam Husain.

    ReplyDelete
  7. ఇంత సీరియస్ డిస్కషన్లు చదివిన తరువాత, నా మిత్రుడు పంపిన జోక్ గుర్తొచ్చింది. కాస్త ఎగతాళిగా ఉన్నా, ఈ న్యూక్లియర్ డిబేట్ పై మంచి చర్చ ఈ జోకులో ఉంది చూడగలరు.



    A stranger was seated next to a little girl on the airplane when the stranger turned to her and said, "Let's talk. I've heard that,

    "Flights go quicker if you strike up a conversation with your fellow passenger."

    The little girl, who had just opened her book, closed it slowly and

    said to the stranger, "What would you like to talk about?"

    Oh, I don't know", said the stranger. "How about nuclear power?"

    "OK," she said. "That could be an interesting topic. But let me ask you a question first.

    A horse, a cow, and a deer all eat grass, the same stuff.

    Yet a deer excretes little pellets, while a cow turns out a flat patty, and a horse produces clumps of dried grass.

    Why do you suppose that is?"

    The stranger thinks about it and says, "Hmmm, I have no idea,"

    To which the little girl replies,

    "Do you really feel qualified to discuss nuclear power when you don't know shit?"

    Moral Of the Story is....Why are left parties talking so loudly about nuclear deal and trying to bring down the government, when they care shit about welfare of the people and basic needs like Food,Health and Education for which large population of our country is dying for.

    ReplyDelete

 
Support us : APTF257 || మాష్టారు || Ajit Kumar ||
Copyright © 2013. మాష్టారు - All Rights Reserved
Designed by The Masters Mind || Published by Divine Spirit || Tech Gnan ||
Proudly powered by Ajit Kumar || On Facebook || On Twitter ||