నోబుల్ శాంతి బహుమతి తనకు స్వర్గం నుండి లభించినట్టిదన్న కొలంబియా అధ్యక్షుడు శ్రీ జుయస్ మాన్యుయల్ శాంత్రోజ్

Dec 10, 2016



కొలంబియా దేశ అధ్యక్షుడు శ్రీ జుయన్ మాన్యుయల్ శాంత్రోజ్ గారు తనకు  ప్రకటించబడిన నోబుల్ శాంతి బహుమతి తనకు స్వర్గం నుండి లభించిన బహుమతి వంటిదని చెప్పాడు.
నోబుల్ శాంతి బహుమతిని తన దేశ ప్రజలకు అంకితమని అన్నాడు. అర్ధ శతాబ్ద కాలంగా తన దేశంలో జరుగుతున్న అంతర్యుద్ధాన్ని అంతమొందించాలనే తన అసాధ్యమైన కల నెరవేరగలదేమోననే ఆశ ఈ బహుమతి వలన కలుగుతుందని అన్నాడు. పశ్చిమ హెమిస్ఫేరులో చాలకాలంగా జరుగుతున్న సంఘర్షణ వలన 2లక్షల 20వేలమంది చంపబడ్డారని, 80 లక్షల మంది ప్రజలు వలసబాట పట్టారని అన్నారు. ఈ ఒప్పందంతో అలస్కానుండి పటగోనియా వరకూ గల అమెరికా ఖండం లో ఇకపై శాంతి నెలకొంటుందనే ఆశాభావాన్ని ప్రకటించారు. కొలంబియా విప్లవాత్మక ఆయుధ శక్తి అనే సంస్థతో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ  ఆ ఒప్పందంపై జరిగిన ప్రజాభిప్రాయపు ఎన్నికలో కొద్ది ఓట్ల తేడాతో శాంతి ఒప్పందం తిరస్కరింపబడినది.  ఈ శాంతి ఒప్పందం అమలు జరగడానికి అన్నిదేశాల సహకారం కావాలని కోరాడు. 
Share this article :

0 comments:

Speak up your mind

Tell us what you're thinking... !

 
Support us : APTF257 || మాష్టారు || Ajit Kumar ||
Copyright © 2013. మాష్టారు - All Rights Reserved
Designed by The Masters Mind || Published by Divine Spirit || Tech Gnan ||
Proudly powered by Ajit Kumar || On Facebook || On Twitter ||