Narendra Modi the Real Hero of India
రు.500/-,1000/- నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి, వాటిని అక్రమంగా దాచుకొని దేశ ఆర్ధిక వ్యవస్ధను చిన్నాభిన్నం చేస్తున్న వారికి నిజమైన గుణపాఠం నేర్పిన నిజమైన హీరో మోడిజీ.
నరేంద్ర మోడి భారత దేశానికి లభించిన రెండవ
కోహినూరు వజ్రం. ప్రతిపక్ష పార్టీలో ఎదిగిన సమర్ధుడైన నాయకుడు. ఇంతకు మునుపు కూడా కొందరు రాజకీయ నాయకులు మన దేశంలో పెద్ద నోట్లను రద్దు
చేసినప్పటికీ వారు సంపన్నులకు అణిగి మణిగి ఉండి, వారికి ఎలాంటి నష్టమూ కలుగని
రీతిలో వ్యవహరించారు. కానీ మోడీజీ పూర్తిగా పూర్వీకులకు వ్యతిరేకంగా సంపన్నులు
ఖంగు తినేలా వ్యవహరించారు. సంపన్నులకు వ్యతిరేకంగా
పరిపాలించిన మొదటి పాలకుడు మోడీ. నల్లడబ్బు దాచుకున్న సంపన్నులు తాము దాచుకున్న
డబ్బును తమ చేజేతులా తామే అగ్నికి ఆహుతి చేయవలసివచ్చింది. ఇది వారికి పట్టరాని కోపాన్ని
కలిగించవచ్చు. ఈ పని మోడీ గారి ప్రాణాలకే ప్రమాదంగా పరిణమించవచ్చు. ఒక వీర జవాను మాదిరిగా తన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా సామాన్య
ప్రజలకు మేలు చేయడానికి కంకణం కట్టుకున్న ధీరుడు మోడిగారు.
పేదలు ఇబ్బందులు పడుతున్నారని లోలోపల బాధ
ఉన్నప్పటికీ నల్ల డబ్బు దాచుకున్నవారికి ఎటువంటి అవకాశమూ ఇవ్వనికూడదనే ధృడ
నిశ్చయంతో నల్ల దొంగలపై పోరాడుతున్న ప్రధానికి ప్రజలందరూ హృదయపూర్వక మద్దతును
ప్రకటించాలి. జై మోడీ.
0 comments:
Speak up your mind
Tell us what you're thinking... !